స్టాక్ మార్కెట్లలో లాభాల జోరుకు బ్రేక్

02-12-2022 Fri 16:06 | Business
  • ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్
  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 415 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Markets ends in losses
స్టాక్ మార్కెట్లలో లాభాల జోరుకు బ్రేక్ పడింది. గత ఎనిమిది రోజులుగా ప్రతి రోజు గరిష్ఠ స్థాయులను నమోదు చేస్తూ వచ్చిన మార్కెట్లు ఈరోజు నష్టపోయాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు నష్టపోయి 62,868కి పడిపోయింది. నిఫ్టీ 116 పాయింట్లు పతనమై 18,696కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.22%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.18%), టెక్ మహీంద్రా (1.16%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.35%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.08%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.78%), మారుతి (-1.58%), నెస్లే ఇండియా (-1.52%), హెచ్డీఎఫ్సీ (-1.32%).