Fibromyalgia: ఫైబ్రోమయాల్జియా ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స ఉందా?

  • తీవ్ర మానసిక ఒత్తిడులు, ఆందోళనలతో వచ్చే రిస్క్
  • కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, గాయాల వల్ల కూడా తలెత్తవచ్చు
  • చికిత్సే కానీ, శాశ్వత పరిష్కారం లేని వ్యాధి
What is Fibromyalgia and how it appears

ఫైబ్రోమయాల్జియాతో బాధపడుతున్నట్టు ప్రముఖ నటి పూనమ్ కౌర్ ప్రకటించింది. దీంతో ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడడం సహజం. ఫైబ్రోమయాల్జియా సమస్యను భరించడం కష్టమే. ఎందుకంటే ఈ వ్యాధిలో మస్కులోస్కెలటల్ సిస్టమ్ అంతటా నొప్పి వేధిస్తుంటుంది. అంటే ఎముకలు, మృదులాస్థి, టెండాన్లు ఇలా శరీరమంతటా కండరాల్లో తీవ్రమైన నొప్పి బాధిస్తుంటుంది. ఫైబ్రో మయాల్జియాలో మెదడులో కొన్ని రకాల కెమికల్స్ అసాధారణంగా పెరిగిపోయి, అవి నొప్పి సంకేతాలను కలిగిస్తాయి. నాడీ సంబంధిత ప్రేరణ అధికం కావడం వల్ల మెదడు, వెన్నెముకలో మార్పులు చోటు చేసుకుంటాయి.


లక్షణాలు..
శారీరక గాయాలు, సర్జరీ తర్వాత, ఇన్ఫెక్షన్ లేదంటే మానసికపరమైన గణనీయమైన మార్పుల తర్వాత ఈ వ్యాధికి గురికావచ్చు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బాధితులుగా ఉంటున్నారు. ఫైబ్రోమయాల్జియాలో తీవ్రమైన తలనొప్పి, టెన్షన్, యాంగ్జైజీ, డిప్రెషన్ సమస్యలు కనిపిస్తుంటాయి. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. లక్షణాలను నియంత్రించడానికి ఎన్నో ఔషధాలు అయితే ఉన్నాయి. ఒత్తిడి తగ్గించుకోవడం కూడా సాయపడుతుంది. వరుసగా మూడు నెలలకు పైగా శారీరక నొప్పులు వేధిస్తుంటే దాన్ని ఫైబ్రోమయాల్జియాగా చెబుతారు. 

కారణాలు..
జన్యు సంబంధితంగా, ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ సమస్య రావచ్చు. అలాగే, శారీరకంగా గాయాలకు గురైన తర్వాత, దీర్ఘకాలం పాటు మానసికంగా ఒత్తిడులు, కుంగుబాటునకు లోనైనప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే వారసులకు రావచ్చు. అలాగే, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ ఉన్న వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. కనుక అంతుబట్టకుండా మూడు నెలలకు పైగా నొప్పులతో బాధపడేవారు ఒక్కసారి వైద్యుల సలహాను తీసుకోవడం మంచిది.

More Telugu News