'హిట్ 2'కు పాజిటివ్ రివ్యూలు.. ఓటీటీ హక్కులు ఆ సంస్థ సొంతం!

02-12-2022 Fri 13:53 | Entertainment
  • ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా
  • టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో భారీ అంచనాలు
  • భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్ కొన్న అమెజాన్ ప్రైమ్ వీడియో
Adivi Seshs HIT 2 seals its OTT partner
విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు యువ నటుడు అడివి శేష్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే మేజర్ సినిమాతో భారీ విజయంతో  పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తాజాగా ‘హిట్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విష్వక్సేన్ హీరోగా వచ్చిన హిట్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మంచి స్పందనే వస్తోంది. 

నేచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా, రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే కనీసం నెల రోజులైనా ఎదురు చూడాల్సివుంది.