ముఖం నిండా సూదులు గుచ్చినా.. చిర్నవ్వు చిందిస్తున్న హీరోయిన్!

02-12-2022 Fri 13:01 | Entertainment
  • ముఖం మొత్తం సూదులు గుచ్చిన ఫొటోను షేర్ చేసిన మెహరీన్ 
  • అక్యూ స్కిన్ లిఫ్ట్ అనే థెరపీ చేయించుకున్న నటి
  • కొంతకాలంగా వరుస పరాజయాల్లో మెహరీన్
What happened to Mehreens face
నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో మెహరీన్ టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’ వంటి హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్లు కొట్టిన హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ లాంటి సినిమాలు ఆడిగా ఆమెకు పెద్దగా క్రెడిట్ రాలేదు. ఆ మధ్య తను పెళ్లికి సిద్ధమైనప్పటికీ కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. మెహరీన్ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు మరో కన్నడ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు తప్ప ఆమెకు ఆఫర్లు లేవనే చెప్పాలి. అయితే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. 

తాజాగా ఆమె చేసిన పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్త భయంగా ఉందనొచ్చు. ఎందుకంటే ఈ ఫొటోలో మెహరీన్ ముఖం సూదులతో నిండిపోయింది. మొహం నిండా సూదులు గుచ్చుకొని ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చింది. దీని గురించి ఆమె వివరిస్తూ.. ‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అక్యూ స్కిన్ లిఫ్ట్ అనే ఈ థెరపీ ద్వారా నా అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వైద్యుల పర్యవేక్షణలో దీనికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ థెరపీ తర్వాత ముఖం మరింత మెరుపుతో అందంగా కనిపిస్తుంది’ అని పేర్కొంది. 

ఇటీవల చాలా మంది హీరోయిన్లు ఆక్యు స్కిన్ లిఫ్ట్ ట్రీట్‌మెంట్‌తో తమ అందాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ‘నా కోసం ఈ థెరపీ చేసినందుకు.. నా ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దినందుకు థెరపిస్ట్ కి ధన్యవాదాలు’ అని చికిత్స తర్వాత థెరపిస్టుతో దిగిన ఫొటోను కూడా మెహరీన్ షేర్ చేసింది.