Nara Brahmani: హిమాలయాల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్... వీడియో ఇదిగో!

Nara Brahmani bike riding at Himalayas
  • బైక్ రైడింగ్ తో అదరగొట్టిన బ్రాహ్మణి
  • లడఖ్ నుంచి లేహ్ వరకు అడ్వెంచర్ ట్రిప్
  • వీడియో పంచుకున్న బైక్ తయారీ సంస్థ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి హిమాలయాల వద్ద బైక్ రైడింగ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్ లో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. సదరు బైక్ ఉత్పత్తిదారు ఎంతో ఉత్సాహవంతులైన బైకర్లతో ఓ టీమ్ ను తయారు చేసి అడ్వెంచర్ డ్రైవ్ నిర్వహించింది. తాజాగా లడఖ్ నుంచి లేహ్ సెక్టార్ వరకు ఈ రైడ్ చేపట్టారు. ఈ టీమ్ లో నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. 

నందమూరి బాలకృష్ణ తనయ, టీడీపీ అధినేత చంద్రబాబు కోడలుగా, అన్నింటికి మించి మహిళా వ్యాపారవేత్తగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నారా బ్రాహ్మణి మంచి బైక్ రేసర్ అన్న సంగతి చాలామందికి తెలియదు. బైక్ రైడింగ్ దృశ్యాలతో కూడిన వీడియోను జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ పంచుకోవడంతో బ్రాహ్మణి బైక్ రైడింగ్ ఆసక్తి గురించి వెల్లడైంది.

  • Loading...

More Telugu News