ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నవంబర్ వేతనం ఎందుకు నిలపకూడదో చెప్పండి: ఏపీ హైకోర్టు
- కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపాదికన వైద్యులను నియమించుకున్న ప్రభుత్వం
- వైద్యులకు 2 నెలల వేతనం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
- వేతనాల కోసం హైకోర్టును ఆశ్రయించిన వైద్యులు
- తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా
కరోనా సమయంలో వైద్య సేవల కోసం పలువురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాల్లో భాగంగా 2 నెలల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ వేతనాల కోసం తాత్కాలిక వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కు చెందిన నవంబర్ నెల వేతనాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.