Nara Lokesh: వాడెవడో నన్ను చంపుతాడంట... మేం కొట్టే బ్యాచే కానీ, కొట్టించుకునే బ్యాచ్ కాదు: నారా లోకేశ్

Nara Lokesh reiterates they will never give up
  • ఇటీవల ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి వ్యాఖ్యలు
  • తాము బెదిరిపోయే రకం కాదన్న లోకేశ్ 
  • తాము చాలెంజ్ చేస్తే వైసీపీ నేతలు రోడ్లపైకి రారని ఎద్దేవా
ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి (చందు) తమపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఓ ఎమ్మెల్యే తమ్ముడో, అన్నో నన్ను చంపేస్తాడంట... మేం కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు అని స్పష్టం చేశారు. 

ప్రజల కోసం పోరాడతాం కాబట్టే తనపై 15 కేసులు ఉన్నాయని లోకేశ్ వెల్లడించారు. వాటిలో హత్యాయత్నం కేసు, ఎస్సీఎస్టీ కేసు కూడా ఉన్నాయని వివరించారు. బెదిరిస్తేనో, కేసులు పెడితేనో మేం పారిపోయే రకం కాదు జగన్ రెడ్డీ... నేను నీలాగా కాదు అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. 

మేం అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు సరిగ్గా సమాధానం కూడా చెప్పుకోలేరు... మేం చాలెంజ్ చేశామంటే ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డుపైకి రాడు... ఇంకా గట్టిగా మాట్లాడితే మమ్మల్ని చంపిస్తాడంట అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
TDP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News