Sensex: సరికొత్త లాభాలకు స్టాక్ మార్కెట్లు

  • వరుసగా ఏడో రోజు లాభపడ్డ మార్కెట్లు
  • 185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 54 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
Stock markets touches new heights

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో మరోసారి సరికొత్త గరిష్ఠ స్థాయులను తాకాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను పెడుతుండటంతో మన మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 63,284కి చేరుకుంది. నిఫ్టీ 54 పాయింట్లు పుంజుకుని 18,813 వద్ద స్థిరపడింది. ఐటీ, రియాల్టీ, మెటల్, టెక్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.86%), టాటా స్టీల్ (2.79%), టీసీఎస్ (2.44%), టెక్ మహీంద్రా (2.20%), విప్రో (1.63%),

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.41%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.06%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.98%), కోటక్ బ్యాంక్ (-0.61%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.54%).

More Telugu News