Team India: సూపర్ మార్కెట్ సిబ్బందితో గొడవ పడ్డ భారత క్రికెటర్

India womens cricketer Rajeshwari Gayakwad involved in altercation at super market
  • సిబ్బందిపై దాడి చేసిన మహిళా క్రికెటర్ రాజేశ్వరికి సంబంధించిన వ్యక్తులు
  • సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టిన సూపర్ మార్కెట్ సిబ్బంది
  • పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చర్చలతో సమస్య పరిష్కారం
  • కర్ణాటకలోని విజయపురలో ఘటన 
భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్ రాజేశ్వరి గైక్వాడ్ సూపర్ మార్కెట్ సిబ్బందితో గొడవ పడి వార్తల్లో నిలిచింది. కర్ణాటకలోని విజయపురలోని కొన్ని సౌందర్య సాధనాలను కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్‌ కు వెళ్లినప్పుడు ఈ గొడవ చోటు చేసుకుంది. సిబ్బందితో వాగ్వాదం తర్వాత ఆమె సూపర్ మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత క్రికెటర్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు సూపర్‌మార్కెట్‌లోకి చొరబడి సిబ్బందిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సూపర్ మార్కెట్ సిబ్బంది బయట పెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. 

అయితే, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. సిబ్బందితో రాజేశ్వరి గొడవ పడటానికి కారణం ఏమిటో తెలియరాలేదు. స్పిన్ బౌలరైన రాజేశ్వరి 2014న శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఆరేళ్లలో భారత జట్టులో కీలక క్రికెటర్ గా మారింది. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో ఆమె కీలక ప్లేయర్ గా ఉంది. ఆ ప్రపంచ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసింది.
Team India
women cricketer
Rajeshwari Gayakwad
altercation
super market

More Telugu News