బిగ్ బాస్ లో 'టికెట్ టు ఫినాలే' .. రేవంత్, శ్రీసత్య మధ్య గొడవ!

  • బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే'
  • ముందుగానే గేమ్ నుంచి తప్పుకున్న శ్రీసత్య 
  • అదే బాటలో ఇనయా .. కీర్తి .. రోహిత్ 
  • తన ఓటమి పట్ల రేవంత్ అసహనం 
  • తనని శాడిస్టు అనడం పట్ల అతనిపై శ్రీసత్య ఫైర్
Bigg Boss 6  Update

బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' కి సంబంధించిన గేమ్స్ నడుస్తున్నాయి. మొదటి నుంచి కూడా ప్రతి గేమ్ లోను చురుకుగా ఆడుతూ వస్తున్న శ్రీసత్య ఆందరి కంటే ముందుగా ఈ గేమ్ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యం. ఇనయా తరువాత జరిగిన పరిణామాల కారణంగా కీర్తి .. రోహిత్ కూడా ఈ గేమ్  నుంచి తప్పుకున్నారు. దాంతో మిగిలిన రేవంత్ .. శ్రీహాన్ .. ఆదిరెడ్డి .. ఫైమాకి బిగ్ బాస్ మరో గేమ్ పెట్టారు. 

ఒక చెక్క ఫ్రేమ్ కి పొడవైన చెక్క గరిట అమర్చబడి ఉంటుంది. ఆ గరిట మధ్య భాగం మాత్రమే ఆ ఫ్రేమ్ కి కనెక్ట్ అయ్యుంటుంది. ఒక చివరన పింగాణీ ప్లేట్స్ ఒకదానిపై ఒకటి పేర్చుతూ, అవి పడిపోకుండా మరో చివరన పట్టుకుని హ్యాండిల్ చేస్తుండాలి. ఎవరి ప్లేట్స్ క్రింద పడిపోతే వారు ఈ గేమ్ నుంచి పక్కకి తప్పుకోవలసి ఉంటుంది. ఈ గేమ్ కి శ్రీ సత్య - ఇనయా సంచాలకులుగా వ్యవహరించారు. 

ఈ గేమ్ లో ప్లేట్స్ ను బ్యాలెన్స్ చేయలేక ముందుగా ఫైమా .. ఆ తరువాత రేవంత్ .. శ్రీహాన్ బయటికి వచ్చారు. చివరి వరకూ ఆదిరెడ్డి మాత్రమే ఉన్నాడు. అయితే తాను బరిలో ఉన్నప్పుడు సంచాలకురాలిగా శ్రీసత్య కాలయాపన చేయడం వలన, అంతసేపు తాను బ్యాలెన్స్ చేయలేకపోయానని రేవంత్ ఆరోపణ చేశాడు. ఆ తరువాత పోటీదారులు ఇబ్బంది పడకుండా చూసిందంటూ మండిపడ్డాడు. ఆయన శ్రీసత్యను శాడిస్టు అనడంతో ఆమె ఒక్కసారిగా ఫైర్ అయింది. ఓటమిని తీసుకోలేక అలా మాట్లాడటం కరెక్టు కాదంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద రచ్చనే జరిగింది.

More Telugu News