Vijay Devarakonda: విజయ్ దేవరకొండను 12 గంటలు విచారించిన ఈడీ

Vijay Deverakonda questioned about12 Hour by ed officials
  • పాప్యులారిటీతో వచ్చే ఇబ్బందుల్లో ఇదొకటన్న హీరో
  • బాధ్యతగల పౌరుడిగా విచారణకు హాజరయ్యానని వ్యాఖ్య
  • మళ్లీ రమ్మనలేదని చెప్పిన విజయ్ దేవరకొండ
  • లైగర్ సినిమాలో పెట్టుబడులపై ప్రశ్నించినట్లు సమాచారం
లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. ఉదయం 8:30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. ఉదయం నుంచి ఏకధాటిగా విజయ్ ను అధికారులు విచారించారు. కాగా, విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు హీరో విజయ్ విలేకరులతో మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ.. పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని వ్యాఖ్యానించారు.

విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీసుకు వచ్చినట్లు విజయ్ తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబిచ్చినట్లు చెప్పారు. తనను మళ్లీ రమ్మని పిలవలేదని స్పష్టం చేశారు. పాప్యులారిటీ పెరుగుతున్నపుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవని విజయ్ దేవరకొండ చెప్పారు. 

కాగా, విజయ్ హీరోగా నటించిన ‘లైగర్’ సినిమాను రూ.100 కోట్లతో తెరకెక్కించినట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. ఈ పెట్టుబడులలో మనీలాండరింగ్, హవాలా కోణాలపై ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. లైగర్ డైరెక్టర్ పూరీజగన్నాథ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు.
Vijay Devarakonda
liger
Enforcement Directorate
12 hour questioning
ed

More Telugu News