సమంత ఆరోగ్యం విషమించిందంటూ మళ్లీ వార్తలు.. స్పందించిన సామ్ టీం

  • సమంత ఆరోగ్యంగానే ఉన్నారన్న ఆమె టీం
  • సామ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
  • విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న సమంత
Actress Samantha team responds news about her health

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత ఆరోగ్యంపై మరోమారు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె ఆరోగ్యం విషమించిందంటూ వైరల్ అవుతున్న వార్తలపై సమంత టీం స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ కొట్టి పడేసింది. సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. 

నిజానికి సమంత ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సామ్ స్వయంగా వెల్లడించిన తర్వాత ఆమె ఆరోగ్యంపై పుకార్లు షికారు చేశాయి. ఆమె ఆరోగ్యం విషమించిందని, చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అప్పుడు కూడా సమంత ఆ వార్తలకు చెక్ పెట్టారు. 

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే ‘యశోద’ సినిమాలో నటించిన సమంత తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు.

More Telugu News