వైసీపీ నేతలపై మంగళగిరి కోర్టులో నారా లోకేశ్ పిటిషన్

30-11-2022 Wed 22:00 | Andhra
  • పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పై పిటిషన్
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న లోకేశ్
  • ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని  కోర్టును కోరిన వైనం
Nara Lokesh files petition in Mangalagiri court
గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో టీడీపీ నేత నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ రెడ్డి అభ్యంతరకర ప్రచారం చేస్తున్నారని పిటిషన్ లో ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారంతో తన పరువుకి భంగం వాటిల్లేలా చేస్తున్నారని పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.