భారీ లెవెల్లో విడుద‌ల‌వుతున్న అరుణ్ విజ‌య్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’

30-11-2022 Wed 19:26 | Entertainment
  • తెలుగులో 'ఆక్రోశం' పేరుతో వస్తున్న తమిళ సినిమా 'సినం' 
  • అరుణ్ విజయ్ సరసన నటించిన పాలక్ లల్వానీ
  • తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నిర్మాతలు
Vijay Arun movie Aakrosham to release on Dec 9
వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ యువ హీరో అరుణ్ విజయ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. పలు హిట్ చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన తాజా చిత్రం 'ఆక్రోశం' డిసెంబర్ 9న భారీ లెవెల్లో విడుదల కానుంది. తమిళంలో యాక్షన్ క్రైమ్ థిల్లర్ అండ్ ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన 'సినం' చిత్రాన్ని 'ఆక్రోశం' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. 

ఈ చిత్రంలో అరుణ్ విజయ్ సరసన పాలక్ లల్వానీ నటిస్తుండగా.. ఇతర ప్రధాన పాత్రలను కాళీ వెంకట్, ఆర్.యన్.ఆర్ మనోహర్, కే.యస్.జి. వెంకటేష్, మరుమలార్చి భారతి తదితరులు పోషించారు. కుమారవేలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సతీష్ కుమార్, ఆర్. విజయకుమార్ లు నిర్మాతలుగా వ్యవహరించారు.  

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘మంచి సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. అరుణ్ విజ‌య్‌ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమాలు ఇక్క‌డ కూడా మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. ఇంతకు ముందు అరుణ్ విజయ్ హీరోగా న‌టించిన 'ఏనుగు' సినిమాను మా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేశాం. రీసెంట్‌గా త‌మిళంలో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టించిన 'సినం' సినిమా త‌మిళంలో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. దాన్ని తెలుగులో 'ఆక్రోశం' పేరుతో డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్‌, రివెంజ్ ఇలా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పారు.