'అన్ స్టాపబుల్ 2' వేదికపై లెజెండరీ దర్శక నిర్మాతలు!

30-11-2022 Wed 16:40 | Entertainment
  • 'ఆహా'లో జోరుగా సాగుతున్న 'అన్ స్టాపబుల్ 2'
  • ఈ వేదికపై సందడి చేయనున్న లెజెండరీ దర్శక నిర్మాతలు 
  • డిసెంబర్ 2వ తేదీన కానున్న స్ట్రీమింగ్
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి
Unstoppable 2 Update
'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై బాలకృష్ణ వ్యాఖ్యాతగా 'అన్ స్టాపబుల్' టాక్ షో ఎంత పాప్యులర్ అయిందనేది అందరికీ తెలిసిందే. నెంబర్ వన్ టాక్ షోగా ఇది నిలిచింది. దాంతో అదే ఉత్సాహంతో సీజన్ 2ను ఇటీవలే ప్రారంభించారు. పలువురు సినీ .. రాజకీయ ప్రముఖులు ఈ వేదిక ద్వారా తమకి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ టాక్ షోలో వచ్చే శుక్రవారం .. అంటే డిసెంబర్ 2వ తేదీన మరో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో దర్శకులుగా .. నిర్మాతలుగా  లెజెండ్స్ అనిపించుకున్న రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి .. సురేశ్ బాబు .. అల్లు అరవింద్ ఈ ఎపిసోడ్ లో తమ మనోభావాలను ఆవిష్కరించనున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.దర్శకులుగా రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి భారీ విజయాలను అందించారు .. అప్పట్లోనే కొత్త రికార్డులను నమోదు చేశారు. ఇక నిర్మాతలుగా సురేశ్ బాబు - అల్లు అరవింద్ తెలుగు సినిమాను కొత్త దారుల్లో పరుగులు తీయించారు. ఈ నలుగురు ప్రముఖులను ఒకే వేదికపై చూడటం అరుదైన విషయమే. 'అన్ స్టాపబుల్' సీజన్ 2లో చెప్పుకోదగిన ఎపిసోడ్స్ లో ఇది ఒకటి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.