దూసుకుపోయిన మార్కెట్లు... చరిత్రలో తొలిసారి 63 వేల మార్కును దాటిన సెన్సెక్స్

30-11-2022 Wed 16:02 | Business
  • వరుసగా మూడో రోజు గరిష్ఠాలను అధిగమించిన మార్కెట్లు
  • 63,100కి చేరిన సెన్సెక్స్
  • 140 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Sensex crosses 63K mark
దేశీయ స్టాక్ మార్కెట్ల గత మూడు రోజులుగా వరుసగా ఆల్ టైమ్ రికార్డులను అధిగమిస్తున్నాయి. మార్కెట్లలోకి వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులు, మన కరెన్సీ విలువ కాస్త పుంజుకోవడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గింస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 63,100కి చేరింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 18,758కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.00%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.16%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.78%), భారతి ఎయిర్ టెల్ (1.55%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.97%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.66%), ఐటీసీ (-0.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.33%).