శంకర్ చిత్రం గురించి అప్​డేట్ ఇచ్చిన రామ్ చరణ్

30-11-2022 Wed 14:45 | Entertainment
  • పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లిన చిత్ర బృందం
  • చిత్రీకరణ పూర్తయిందని ట్వీట్ చేసిన చెర్రీ
  • విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని వెల్లడి
And its a wrap in New Zealand tweets ramcharan
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో ఓ సినిమా తెరుకెక్కుతోంది. రామ్ చరణ్ కు ఇది 15వ సినిమా. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. 'వినయ విధేయ రామ' తర్వాత చరణ్, కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఇందులో భాగంగా ఓ పాటను శంకర్ న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. దాదాపు రూ. 15–20 కోట్ల ఖర్చుతో ఈ డ్యూయెట్ ను చిత్రీకరించారు.  

న్యూజిలాండ్ లో అత్యంత అందమైన ప్రదేశాల్లో చెర్రీ, కియారా జంటపై చిత్రీకరించిన ఈ డ్యూయెట్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. దాదాపు పది రోజుల పాటు ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ వెల్లడించారు. న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయిందని ట్వీట్ చేశాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. తమన్ అద్భుతమైన బాణీలు అందించాడని, శంకర్ బాగా తీశాడని రామ్ చరణ్ పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేసి చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో చరణ్, కియారా లుక్స్ సూపర్ గా ఉన్నాయి.