తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 'లవ్ టుడే' రాబట్టిన నెట్ ఇదే!

30-11-2022 Wed 14:40 | Entertainment
  • ప్రేమకథగా రూపొందిన 'లవ్ టుడే'
  • స్మార్టు ఫోన్ ప్రేమ వ్యవహారాలే ప్రధానమైన కథాంశం 
  • ఈ జనరేషన్ కి కనెక్ట్ అయిన కంటెంట్ 
  • తెలుగులోను భారీ వసూళ్లను రాబడుతున్న సినిమా
Love Today Movie Update
ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'లవ్ టుడే' ఒకటి. ఒక డిఫరెంట్ పాయింట్ పట్టుకుని వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా మంచి జోరు చూపిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా .. దర్శకుడిగా చేసిన ఈ సినిమాలో కథానాయికగా ఇవాన కనిపించింది. తమిళంలో ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

స్మార్టు ఫోన్ ద్వారా నడుస్తున్న ఈ తరం ప్రేమ వ్యవహారాలను సరదాగా ఆవిష్కరిస్తూ సందడి చేస్తున్న సినిమా ఇది. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో, తమిళనాట ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తెలుగులోను మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లో 7.4 కోట్ల నెట్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు.  తమిళంలో కేవలం 7 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, అక్కడ 50 కోట్ల మార్కును టచ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక తెలుగులోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటం విశేషం.