తలస్నానం ఇలా కూడా చేయొచ్చా.. సామీ!

30-11-2022 Wed 12:59 | Offbeat
  • నీటి క్యాన్ ను వీపుపై కట్టేసుకున్న యువకుడు
  • కింద కూర్చుని నడుమును పైకి ఎత్తుతూ నీరు తలపైకి వచ్చే ఏర్పాటు
  • తక్కువ నీటితోనే స్నానం పూర్తి
Video Showing Mans Unique Technique To Wash Hair Surprises Internet
మేధోమధనంతో ఎన్నో కొత్త ఐడియాలు పుట్టుకొస్తుంటాయి. అవసరమే ఆవిష్కరణకు మూలం అవుతుందని చెబుతారు. ఓ వ్యక్తి ఇలానే తన అవసరం తీర్చుకునేందుకు, ఆలోచనకు పదును పెట్టాడు. షవర్ లేకపోయినా ఎంచక్కా తలస్నానం , తక్కువ నీటితోనే కానిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ పైకి చేరడంతో అది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

రోమ బల్వానీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి నీటితో ఉన్న క్యాన్ ను తన వీపునకు టవల్ తో కట్టుకున్నాడు. క్యాన్ మూతి భాగం తన తలవైపున ఉండేలా కట్టేశాడు. క్యాన్ మూత తీశాడు. కింద కూర్చుని, తల ముందు భాగంలో ఓ టబ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు తలపై నీరు పోసుకోవాల్సి వచ్చినప్పుడల్లా నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ క్యాన్ లో నీటిని తన తలపైకి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నీటి ఆదాను ప్రధానంగా గుర్తించొచ్చు. ఆ వ్యక్తి ఆలోచనను పలువురు అభినందిస్తుంటే, ఇది పేదరికానికి నిదర్శనమని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.