ఆ పాట వినగానే చిరంజీవిగారు షూటింగు ఆపేశారు: మణిశర్మ

30-11-2022 Wed 12:44 | Entertainment
  • మణిశర్మ ఫస్టు మూవీగా 'చూడాలని వుంది'
  • ఉదిత్ నారాయణ్ పాడిన 'రామ్మా చిలకమ్మా'
  • ముందుగా అభ్యంతరం చెప్పిన మెగాస్టార్ 
  • ఆ తరువాత ఒకే చెప్పడం జరిగిందన్న మణిశర్మ 
Manisharma Interview
చిరంజీవి ఎక్కువగా అభిమానించే సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. అలాంటి చిరంజీవి .. మణిశర్మ స్వరపరిచిన ఒక పాట వినగానే షూటింగు కేన్సిల్ చేశారట. ఆ విషయాన్ని గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మణిశర్మ ప్రస్తావించారు.

'చూడాలని వుంది' సినిమాలో 'రామ్మా చిలకమ్మా' సాంగు సూపర్ హిట్ అయింది. ఆ పాటను ఉదిత్ నారాయణ్ తో పాడిస్తే బాగుంటుందని భావించి .. ఆయనతోనే పాడించాను. ఆ రోజున ఆ సాంగు షూటింగును పెట్టుకున్నారు. సెట్లో ఈ పాట వినగానే చిరంజీవి అభ్యంతరం చెప్పారు. 'రొంప' చేసినవాళ్లు పాడుతున్నటుగా ఉందంటూ షూటింగు కేన్సిల్ చేశారు. 

దాంతో అప్పటికప్పుడు వేటూరిగారితో మరో పాట రాయించి .. చెన్నై లో రెండు రాత్రుల పాటు కూర్చుని మరో పాటను రెడీ చేశాము. ఆ పాటను బాలూగారితో పాడించడం జరిగింది. కానీ రెండవసారి చేసిన కొత్త పాటకంటే, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వైపునే అంతా మొగ్గు చూపారు. కొత్తదనం కోసం నేను అలా ట్రై చేశాను అంతే. నిజానికి బాలుగారు అంటే నాకు ఎంతో ఇష్టం .. నేనంటే ఆయనకి ఎంతో అభిమానం" అంటూ చెప్పుకొచ్చారు.