YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు

Nampally court grants bail to YS Sharmila
  • ప్రగతి భవన్ వెళ్లేందుకు షర్మిల యత్నం
  • పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు
  • షర్మిలను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్
  • షర్మిల సహా ఏడుగురికి బెయిల్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షర్మిల సహా ఏడుగురికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. 

వరంగల్ జిల్లాలో తన వాహనంపై దాడిని నిరసిస్తూ, అదే వాహనంతో షర్మిల లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ కు వెళ్లే ప్రయత్నం చేయడం తెలిసిందే. దాంతో ఆమెను పోలీసులు ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు. అటు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న కారణంతో పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. ఆమెను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, తీవ్రస్థాయిలో వాదోపవాదాలు సాగాయి. ఈ నేపథ్యంలో, షర్మిలకు ఊరట కలిగిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
YS Sharmila
Bail
Nampally Court
Hyderabad
YSRTP
Telangana

More Telugu News