సర్పంచులు ఐక్యంగా చేస్తున్న పోరాటంలో తప్పేముంది?: చంద్రబాబు

29-11-2022 Tue 21:55 | Andhra
  • తిరుపతిలో సర్పంచుల శంఖారావం
  • పోలీసులు భగ్నం చేశారన్న చంద్రబాబు
  • అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నానని వెల్లడి
  • సర్పంచుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్టు వివరణ
Chandrababu extends support for AP Panchayat presidents
తిరుపతిలో గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమల వరకు కాలినడకన వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనుకున్న సర్పంచులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా రాష్ట్రం నలుమూలలకు చెందిన సర్పంచులు ఐక్యంగా చేస్తున్న పోరాటంలో తప్పేముందని ప్రశ్నించారు. 

గ్రామాల అభివృద్ధిని జగన్ రెడ్డి పట్టించుకోకుండా రూ.8,660 కోట్ల నిధులను దారిమళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. కాబట్టే సర్పంచులంతా రోడ్కెక్కారని అన్నారు. ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్న సర్పంచుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు వివరించారు. ప్రభుత్వం సర్పంచుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చంద్రబాబు స్పష్టం చేశారు.