నాని హీరోగా తప్పకుండా ఓ సినిమా చేస్తాను: 'హిట్ 2' డైరెక్టర్

29-11-2022 Tue 21:44 | Entertainment
  • 'హిట్ 2' డైరెక్టర్ గా శైలేశ్ కొలను
  • థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ 
  • ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయన్న డైరెక్టర్
  • డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు
Sailesh Kolanu Interview
గతంలో 'హిట్' సినిమాతో హిట్ కొట్టిన శైలేశ్ కొలను, ఈ నెల 2వ తేదీన 'హిట్ 2' సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'హిట్ 2' సినిమాలో హీరోగా నాని గారినే చేయమని అడిగాను. కానీ ఆయన ఈ సినిమాకి నిర్మాతగానే ఉంటానని చెప్పారు. ఆయనతో ఒక సినిమా చేయాలని ఉంది .. తప్పకుండా చేస్తాను" అన్నాడు. 

థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరంగా జరుగుతాయి. కానీ ఈ సినిమా అలా ఉండదు. హీరో టేకప్ చేసిన కేసు కారణంగా ఫ్యామిలీ పరమైన టెన్షన్స్ ఎలా ఫేస్ చేశాడనేది ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో కొత్త శేష్ ను చూస్తారు. అంత కసిగా ఆయన ఆ పాత్రను చేశాడు" అని చెప్పాడు. 

"ఆల్రెడీ నేను తయారు చేసుకున్న కొన్ని కథలు నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాయి. తరువాత సినిమా ఎవరితో ఉంటుంది? ఎప్పటి నుంచి ఉంటుంది? అనేది డిసెంబర్ 2 తరువాత చెబుతాను. ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిన రెండు మూడు వారాలకు హిందీలో డబ్ చేయడం జరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు.