YS Vijayamma: ఇప్పుడు జగన్ తో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా?: వైఎస్ విజయమ్మ

YS Vijayamma cool reply to a reporter who asked Jagan response on Sharmila arrest
  • పోలీసుల అదుపులో షర్మిల
  • లోటస్ పాండ్ నివాసంలో విజయమ్మ నిరాహార దీక్ష
  • జగన్ స్పందన ఏంటని అడిగిన మీడియా ప్రతినిధి
  • నవ్వుతూ బదులిచ్చిన విజయమ్మ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

జరిగిన పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారా... ఎంతైనా సిస్టర్ కదా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అందుకు విజయమ్మ స్పందిస్తూ, 'ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా' అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఓ అన్నగా జగన్ మోహన్ రెడ్డి ఏమన్నాడు? అంటూ ఆ రిపోర్టర్ తిరిగి ప్రశ్నించగా, విజయమ్మ మళ్లీ అదే సమాధానం చెప్పారు. 

కాగా, తాజా పరిణామాలపై షర్మిల తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని ఆమె పేర్కొన్నారు. తనను షర్మిల వద్దకు పోనివ్వడం లేదు కాబట్టి నిరాహార దీక్షకు దిగానని తెలిపారు.
YS Vijayamma
Sharmila
Jagan
Telangana
Andhra Pradesh

More Telugu News