Vivek Agnihotri: ది కశ్మీర్ ఫైల్స్ లో ఒక్క అవాస్తవ దృశ్యం ఉన్నా సినిమాల నుంచి తప్పుకుంటా: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

The Kashmir Files director Vivek Agnihotri challenges IFFI Jury Head Nadav Lapid
  • కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్
  • ఇఫీ-2022 జ్యూరీ హెడ్ తీవ్ర వ్యాఖ్యలు
  • కశ్మీర్ ఫైల్స్ ఓ దరిద్రగొట్టు సినిమా అన్న నడావ్ లాపిడ్
  • దీటుగా స్పందించిన అనుపమ్ ఖేర్, వివేక్ అగ్నిహోత్రి
కశ్మీరీ పండిట్ల ఊచకోత, వారి వలసకు సంబంధించిన ఘటనలతో తెరకెక్కిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రం భారత్ లో సంచలన వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రంపై ఇఫీ-2022 జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడావ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒక దరిద్రగొట్టు సినిమా అని, వల్గర్ గా తీశారని లాపిడ్ విమర్శించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పటికే లాపిడ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా స్పందించారు. తన సినిమాలో ఒక్క కల్పిత సన్నివేశం కానీ, అవాస్తవ దృశ్యం కానీ ఉన్నట్టు చూపిస్తే తాను సినిమాల నుంచి తప్పుకుంటానని నడావ్ లాపిడ్ కు సవాల్ విసిరారు. 

"ప్రపంచ మేధావులకు, ఈ మహా గొప్ప ఇజ్రాయెలీ దర్శకుడికి ఇదే నా సవాల్... ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఒక్క ఫ్రేమ్ కానీ, ఒక్క డైలాగ్ కానీ, ఒక్క ఘటన కానీ అసత్యం అని నిరూపించండి చాలు... నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా" అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. ఉగ్రవాద మద్దతుదారులు, నరమేధానికి పాల్పడలేదని చెప్పుకునేవారు ఎప్పటికీ నా నోరు మూయించలేరు అని స్పష్టం చేశారు.
Vivek Agnihotri
Nadav Lapid
The Kashmir Files
IFFI Jury
Israel

More Telugu News