దోమకాటుతో ఏకంగా కోమాలోకి వెళ్లిపోయిన యువకుడు!

29-11-2022 Tue 14:20 | Health
  • జర్మనీ యువకుడిని కుట్టిన ఆసియా టైగర్ దోమ
  • అతని శరీరంలోకి పాకిన సెరాటియా బ్యాక్టీరియా
  • కొన్ని వారాల పాటు కోమాలో ఉన్న సెబాస్టియన్
Man gone into coma after mosquito byte
దోమ చాలా చిన్నగా ఉంటుంది... కానీ, అది ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన మనిషికి చుక్కలు చూపిస్తుంటుంది. రకరకాల జ్వరాలతో పాటు దోమల వల్ల మనిషి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఒక వ్యక్తి దోమకాటుతో ఏకంగా కోమాలోకి పోయిన ఘటన జనాలను కలవరపాటుకు గురి చేస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే... జర్మనీ పౌరుడైన సెబాస్టియన్ రోట్షే అనే 27 ఏళ్ల యువకుడికి ఆసియా టైగర్ దోమ కుట్టింది. దీని వల్ల అతని శరీరంలోకి సెరాటియా అనే బ్యాక్టీరియా ప్రవేశించింది. తొలుత అతనికి ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత దోమ కుట్టిన కాలు తొడ భాగం మొత్తం భాగానికి ఇన్ఫెక్షన్ పాకింది. దీంతో అతను మంచానికే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత అతను కోమాలోకి వెళ్లిపోయాడు. కొన్ని వారాల పాటు కోమాలోనే ఉన్నాడు. ఇన్ఫెక్షన్ బాగా పెరగడంతో ఆయన కాలి రెండు వేళ్లను తొలగించారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందించడంతో ఆయన కోమా నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.