తెలుగులో నా ఫేవరేట్ హీరో ఎవరంటే .. !: హీరోయిన్ ఇవాన

29-11-2022 Tue 13:11 | Entertainment
  • 'లవ్ టుడే'లో హీరోయిన్ గా మెరిసిన ఇవాన
  • యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ 
  • తెలుగు సినిమాలు చూస్తుంటానని వెల్లడి 
  • అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పిన ఇవాన  
Ivana Interview
'లవ్ టుడే' సినిమాతో ఇటీవలే 'ఇవనా' బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథాకథనాల సంగతి అటుంచితే, గ్లామర్ తో ఇవాన కుర్ర మనసులను దోచేసింది. ఈ సినిమా సక్సెస్ లో ఆమె గ్లామర్ .. యాక్టింగ్ ప్రధానమైన పాత్రను పోషించాయి.

తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశారు. తొలిరోజునే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ ఈ సినిమా వసూళ్ల సంగతి పక్కన పెడితే, ఇవానకు టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వెళ్లడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆమె ఇక్కడ బిజీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ఒక తాజా ఇంటర్యూలో ఈ కేరళ బ్యూటీ మాట్లాడుతూ .. " తెలుగు సినిమాలు నేను చూస్తూనే ఉంటాను. 'హ్యాపీ డేస్' నుంచి 'జాతి రత్నాలు' వరకూ చూశాను. తెలుగులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటాను. ఆయన యాక్టింగ్ .. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం" అంటూ చెప్పుకొచ్చింది.