Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల గ్యాంగ్ రేప్

friends gand raped 10th class students in Hyderabad
  • హయత్ నగర్ తట్టిఅన్నారంలో దారుణం
  • విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థుల అత్యాచారం
  • 10 రోజుల తర్వాత మరోసారి గ్యాంగ్ రేప్
కోర్టులు ఎంత మందికి కఠినమైన శిక్షలు విధిస్తున్నా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు. అనుదినం ఎంతోమంది బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు, లైంగిక దోపిడీకి గురవుతున్నారు. తాజాగా సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన మరో ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హయత్ నగర్ తట్టిఅన్నారంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ వికృతాన్ని వీడియో తీశారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెపితే వీడియోను బయటపెడతామని బాధితురాలిని బెదిరించారు. ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఆమెపై మరోసారి వీరంతా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. దీంతో, ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
10th Class
Gang Rape

More Telugu News