బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి భయపడ్డాను: రాజ్

  • బిగ్ బాస్ హౌస్ లో 12 వారాలు కొనసాగిన రాజ్
  • ఆదివారం రోజున జరిగిన తన ఎలిమినేషన్ 
  • 'బీబీ కేఫ్' కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్
  • హౌస్ లో ఉండటానికి కారణం అదృష్టమంటూ విమర్శలు 
  • తన ఆటతీరే అందుకు కారణమని వెల్లడించిన రాజ్
Bigg Boss 6  Update

బిగ్ బాస్ హౌస్ లో 12 వారాల పాటు కొనసాగుతూ వచ్చిన రాజ్, ఆదివారం రోజున ఎలిమినేట్ అయ్యాడు. చివరి రౌండులో తన దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా ఎలిమినేషన్ నుంచి ఫైమా బయటపడింది. దాంతో రాజ్ బయటికి రావలసి వచ్చింది. ఆటతీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా, అన్ని వారాల పాటు ఆయన హౌస్ లో ఉండటానికి కారణం అదృష్టమేననే ప్రస్తావన 'బీబీ కేఫ్' ఇంటర్వ్యూలో వచ్చింది.

అందుకు రాజ్ స్పందిస్తూ .. "అదృష్టం వల్లనే నేను హౌస్ లో ఉన్నానని అనడం కరెక్టు కాదు. నా ఆట తీరు జనాలకు నచ్చడం వల్లనే ఉన్నానని అనుకుంటున్నాను. నా కంటే ఫైమాకి తక్కువ ఓట్లు వచ్చాయనే విషయాన్ని మరిచిపోవద్దు. ముందుగా నేను ఎవరితోను ఎక్కువగా కలిసే మనిషిని కాదు. అందువలన హౌస్ లోకి వెళ్లిన తరువాత ఓ నాలుగు వారాల పాటు ఒక రకమైన కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. నా గురించి చెప్పమని నాగ్ సార్ స్టేజ్ పై అడిగినప్పుడే చెప్పలేకపోయాను. ఇక ఇంట్లోకి వెళ్లి ఏం చేస్తానబ్బా అనే టెన్షన్ అప్పుడే నాకు మొదలైంది" అన్నాడు. 

"రెండవ వారంలో నేను కెప్టెన్ అయ్యాను. అయితే అందుకు కారణం నా సమర్థత అని నేను చెప్పడం లేదు. ఇంటి సభ్యులు చూపించిన సానుభూతిగానే భావిస్తున్నాను. కెప్టెన్ అయిన తరువాత మాత్రం ఆ బాధ్యతను ధైర్యంగానే మోసాను. నా కెప్టెన్సీ లో ఎంతమంది హ్యాపీగా ఉన్నారని నాగ్ సార్ అడిగితే, 80 శాతానికి పైగా సంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంటి సభ్యులంతా అలవాటుపడిన తరువాత మాత్రం నా ఆటతీరును మెరుగు పరుచుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News