ఏపీలో భారీ సంఖ్యలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 6,511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- 411 ఎస్సై.. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఎస్సై పోస్టుల్లో 315 సివిల్ ఎస్సైలు
ఇక కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయనున్నారు. ఎస్సై ఉద్యోగాలకు వచ్చే నెల 14 నుంచి.. కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెలాఖరు నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 22న కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు రాత పరీక్ష జరగనుంది.