Dil Raju: ఆ రోజుల్లోనే కోటి రూపాయలు లాస్ అయ్యాను: దిల్ రాజు

  • తన అసలు పేరు వెంకటరమణా రెడ్డి అంటూ వివరణ 
  • డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన నష్టాల ప్రస్తావన   
  • నిర్మాతగా 20 ఏళ్ల అనుభవం 
  • సొంత బ్యానర్లో ఇంతవరకూ 50 సినిమాల నిర్మాణం
Dil Raju Interview

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ చాలావరకూ కరెక్టుగా ఉంటుందని ఇండస్ట్రీలోని వాళ్లంతా భావిస్తూ ఉంటారు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమానికి హాజరైన ఆయన, తన కెరియర్ గురించిన విషయాలను పంచుకున్నారు. 

" నా అసలు పేరు వెంకటరమణా రెడ్డి . మా అమ్మగారు నన్ను 'రాజు' అని పిలిచేవారు .. నైజామ్ ఏరియాకి డిస్ట్రిబ్యూషన్ చేయడం వలన, అందరూ 'నైజామ్ రాజు' అని పిలిచేవారు. 'దిల్' సినిమాతో నిర్మాతను కావడం .. ఆ సినిమా హిట్ కావడంతో 'దిల్' రాజుగా పిలవడం మొదలైంది" అన్నారు. 

 "మొదటి నుంచి కూడా నాకు సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందువలన తెలిసిన వారితో కలిసి డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి దిగాను. 1994 .. 95 .. 96లలో కొన్న ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో కోటి రూపాయల వరకూ లాస్ వచ్చింది. ఆ తరువాత ఒక్కడినే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, జడ్జిమెంట్ విషయంలో దృష్టి పెట్టాను. 

డిస్ట్రిబ్యూటర్ కి సినిమాను చూపించరు .. ఏ సినిమాలో ఏముందనేది రిలీజ్ వరకూ డిస్ట్రిబ్యూటర్ కి తెలియదు. మన సినిమాలో ఏముందో మనకి తెలియాలంటే నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాను. అలా నేను నిర్మాతగా మారడం .. ఈ 20 ఏళ్లలో 50 సినిమాలను నిర్మించడం జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News