Sanju Samson: క్రికెటర్ శామ్సన్ కు మద్దతుగా ఫిఫా వరల్డ్ కప్ లో బ్యానర్లు

We support you Sanju Samson Fans raise banners at FIFA World Cup 2022 in Qatar
  • మేము మీతోనే అంటూ బ్యానర్ రాసి ప్రదర్శించిన అభిమానులు
  • మద్దతు తెలిపిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ
  • న్యూజిలాండ్ సిరీస్ లో శామ్సన్ కు ఒక్కటే అవకాశం
వికెట్ కీపర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శామ్సన్ కు టీమిండియా తుది జట్టులో స్థానం లభించకపోవడం పట్ల అతడి అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అతడికి మద్దతుగా ప్రచారానికి పూనుకుంటున్నారు. ఖతార్ లో జరుగుతున్న ఫిపా వరల్డ్ కప్ 2022 వేదికగా సంజు శామ్సన్ అభిమానులు ఏకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ కనిపించారు. 

‘‘ఫిపా వరల్డ్ కప్ లో మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు?.. మేము’’ అంటూ రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేస్తూ.. ఫిపా ఫుట్ బాల్ ప్రపంచ కప్ స్టేడియం వద్ద సంజు శామ్సన్ మద్దతుదారులు ప్రదర్శించిన బ్యానర్ల చిత్రాలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లిన భారత క్రికెటర్ల బృందంలో శామ్సన్ కూడా ఉన్నాడు. కానీ, మొదటి వన్డే తప్ప పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. 

దీంతో అభిమానుల్లో ఆగ్రహం వచ్చినట్టు కనిపిస్తోంది. ‘మ్యాచ్, జట్టు, లేదా ప్లేయర్ ఎవరైనా కానీ, మేము మీతోనే’ అని బ్యానర్ లో రాసి ఉంది. శామ్సన్ కు చోటు ఇవ్వకపోవడం దురదృష్టకరమేనంటూ, దానికి తగిన కారణం ఉందని టీ20 సిరీస్ కు కెప్టెన్ గా పనిచేసిన పాండ్యా పేర్కొనడం గమనార్హం.
Sanju Samson
Fans
raised banners
FIFA World Cup 2022

More Telugu News