Gautham Karthik: ఘనంగా జరిగిన కోలీవుడ్ ప్రేమ జంట వివాహం

Kollywood Actors Gautham Karthik and Manjima Mohan got married
  • పెళ్లితో ఒక్కటైన గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్
  • చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట
  • ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం
కోలీవుడ్ యువ ప్రేమజంట గౌతమ్ కార్తీక్ , మంజిమా మోహన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. చాలా కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఒక హోటల్ లో వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు వివాహానికి హాజరై యవజంటను ఆశీర్వదించారు. 

సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడే గౌతమ్ కార్తీక్. 'దేవరట్టం' సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తానే తొలుత ఆమెకు ప్రపోజ్ చేశానని గతంలో గౌతమ్ తెలిపాడు. మంజిమ మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో ఆమె నటించింది.
Gautham Karthik
Manjima Mohan
Love Marriage
Kollywood
Tollywood

More Telugu News