Gujarat: ప్రధానికి బెదిరింపు లేఖ కేసులో బాంబే ఐఐటీ పూర్వ విద్యార్థి అరెస్టు

  • మారుపేరుతో మరొకరిని ఇరికించేందుకే చేసినట్లు వెల్లడి
  • ప్రేమ విఫలం కావడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ 
  • ఉత్తరప్రదేశ్ వెళ్లి యువకుడిని అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు
IIT grad held for sending threatening email to PM Modi to avenge failed love affair

తను ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని కోపం పెంచుకున్నాడు.. కక్ష తీర్చుకోవడానికి అతడి పేరుతో ప్రధాని ఆఫీసుకు బెదిరింపు లేఖ రాశాడు. తప్పుడు ఈమెయిల్ అడ్రస్ తో పీఎంవో కు మెయిల్ పెట్టాడు. అయితే, ఒక్కో ఆధారాన్ని పట్టుకుని పోలీసులు తన దాకా వచ్చేసరికి అసలు నిజాన్ని బయటపెట్టాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపుల ఈ-మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే! దీనిని విచారించగా బయటపడ్డ వివరాలను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తాజాగా బయటపెట్టారు.

యూపీలోని బదౌన్ కు చెందిన అమన్ సక్సేనా ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయికి సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో ఓ యువకుడిని అల్లరిపాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. సదరు యువకుడి పేరుతో ప్రధాన మంత్రి ఆఫీసుకు బెదిరింపు లేఖ రాశాడు. ప్రధానిని చంపేస్తామని ఈ మెయిల్ పెట్టడంతో అధికారులు అలర్టయ్యారు.

సాంకేతిక సిబ్బంది సాయంతో విచారించి యూపీలోని బదౌన్ చేరుకున్నారు. అక్కడి పోలీసుల సాయంతో నిఘా పెట్టి అమన్ సక్సేనానే ఈ మెయిల్ పంపినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. గుజరాత్ నుంచి యూపీ వెళ్లిన యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది అమన్ సక్సేనాను అదుపులోకి తీసుకున్నారు. అమన్ ను గుజరాత్ తరలించి, ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనేది విచారిస్తామని పేర్కొన్నారు.

More Telugu News