సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ తో ప్రభాస్ కొత్త చిత్రం!

  • ప్రభాస్ తో సినిమా తీసేందుకు లోకేశ్ కనగరాజ్ ఆసక్తి
  • ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో హిట్స్ కొట్టిన లోకేశ్
  • ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు చిత్రాలు
Blockbuster director in talks with Prabhas

బాహుబలి 1, 2 సినిమాల కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రెండు చిత్రాలూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో, తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. అదే సమయంలో  ఏడాదికి రెండు సినిమాలైనా అందించాలని పట్టుదలగా ఉన్నాడు. వైవిధ్యమైన కథలతో కూడిన పలు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. తాజాగా ప్రభాస్ మరో సినిమాకు ఓకే చెప్పబోతున్నాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

అది కూడా సౌతిండియాలో మరో సెన్సేషనల్ దర్శకుడితో అని తెలుస్తోంది. కార్తితో ఖైదీ, కమల్ హాసన్‌తో విక్రమ్‌ తీసిన లోకేష్‌ కనగరాజ్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో, అతనితో సినిమా చేసేందుకు చాలామంది బడా స్టార్లు ఆసక్తి చూపిస్తున్నారు. లోకేష్‌ మాత్రం ప్రభాస్‌ కోసం వెయిట్ చేస్తున్నాడని వినికిడి. టాలీవుడ్ రెబల్ స్టార్ తో ఓ భారీ యాక్షన్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభాస్, లోకేశ్ కనగరాజ్ ఇటీవలే సమావేశమై చర్చించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే మరో క్రేజీ కాంబినేషన్ తో ఇంకో పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News