Gudivada Amarnath: త్వరలోనే విశాఖ నుంచి పాలన: మంత్రి అమర్‌నాథ్

AP Minister Gudivada Amarnath Told AP Ruling From Visakha Soon
  • మూడు రాజధానులకు అందరి మద్దతు ఉందన్న మంత్రి
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని స్పష్టీకరణ
  • రాష్ట్రంలో ఏ సమస్య ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ పాలన త్వరలో విశాఖ నుంచి జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. విశాఖలో నిన్న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ విషయం తెలిపారు. మూడు రాజధానులకు అందరి మద్దతు ఉందన్న ఆయన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేశారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే విశాఖపట్టణం నుంచి పరిపాలన సాగిస్తారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ త్వరలో చేపట్టనున్న పాదయాత్రపైనా మంత్రి స్పందించారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పాదయాత్రపై పేటెంట్ రాజశేఖరరెడ్డి కుటుంబానిదేనని, యాత్రల ద్వారా వారు ప్రజల్లో భరోసా నింపారని మంత్రి అన్నారు.
Gudivada Amarnath
Visakhapatnam
Three Capitals
Nara Lokesh

More Telugu News