'మీరాబాయి దొరసాని'గా సీనియర్ హీరోయిన్!

26-11-2022 Sat 20:30 | Entertainment
  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'రుద్రాంగి'
  • భీమ్ రావ్ దొర పాత్రను పోషించిన జగపతిబాబు
  • దొరసాని లుక్ తో ఆకట్టుకుంటున్న విమలా రామన్ 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న మమతా మోహన్ దాస్
Rudrangi New Poster Released
తెలంగాణ నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తెలంగాణలో ఒకప్పుడు గడీల పాలన కొనసాగింది. దొరల ఏలుబడిలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. 

అలా దొరల పాలన నేపథ్యంలో రూపొందిన మరో సినిమానే 'రుద్రంగి'. నాయిక ప్రధానమైన కథ అనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతోంది. ఈ సినిమాలో భీమ్ రావ్ దొరగా పరిచయం చేస్తూ, కొన్ని రోజుల క్రితం జగపతిబాబు పోస్టర్ ను వదిలారు. తాజాగా 'మీరాబాయి దొరసాని' పాత్రలో విమలారామన్ ను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

దొరసాని అలంకరణలో విమలా రామన్ నిండుగా .. హుందాగా కనిపిస్తోంది. 'కొన్ని ప్రశ్నలకి కాలమే జవాబిస్తుంది తమ్ముడు' అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరో కీలకమైన పాత్రలో మమతా మోహన్ దాస్ నటించిన ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. రసమయి బాలకిషన్ ఈ సినిమాను నిర్మించారు.