బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు జడేజా దూరం!

  • ఆసియా కప్ సందర్భంగా జడేజాకు గాయం
  • మోకాలికి శస్త్రచికిత్స
  • డిసెంబరు 4 నుంచి బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన
  • 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్న భారత్
Jadeja out of action from Bangladesh tour of Team India

ఆసియా కప్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంకా కోలుకోలేదు. త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు జడేజా దూరమైనట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో కొత్త స్పిన్నర్ సౌరభ్ కుమార్ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. 

బంగ్లాదేశ్ తో టీమిండియా 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన డిసెంబరు 4 నుంచి షురూ కానుంది. కాగా, టెస్టు సిరీస్ డిసెంబరు 14 నుంచి జరగనుండగా అప్పటికల్లా రవీంద్ర జడేజా కోలుకుంటాడని భావించారు. అయితే, జడేజాకు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో అతడు కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. 

ఇక, జడేజా స్థానాన్ని భర్తీ చేయనున్న సౌరభ్ కుమార్ కూడా లెఫ్టార్మ్ స్పిన్నరే. ఉత్తరప్రదేశ్ కు చెందిన సౌరభ్ కుమార్ దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అంతేకాదు, బంగ్లాదేశ్-ఎ జట్టుతో ఆడే ఇండియా-ఎ జట్టులోనూ స్థానం సంపాదించాడు.

More Telugu News