ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్రా లోకేశ్

26-11-2022 Sat 19:29 | Both States
  • నరేశ్, పవిత్రా లోకేష్ ల బంధంపై కథనాలు
  • సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర  
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Actress Pavitra Lokesh complains to Cyber Crime police on trolling
ఇటీవల సీనియర్ నటుడు నరేశ్, దక్షిణాది క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ కు ముడిపెడుతూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ పెళ్లి అని, సహజీవనం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దాంతో పవిత్రా లోకేశ్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల వస్తున్న కథనాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా చానళ్లు, వెబ్ సైట్లు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఆరోపించారు. 

తన ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని, వాటిని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.