ఆకట్టుకుంటోన్న ‘పంచతంత్రం’ ట్రైలర్... కాసేపట్లోనే లక్ష వ్యూస్

26-11-2022 Sat 20:08 | Entertainment
  • ఐదు జంటల కథతో పంచతంత్రం
  • హర్ష పులిపాక దర్శకత్వంలో చిత్రం
  • నిర్మాతలుగా అఖిలేష్ వ‌ర్ధన్‌, సృజ‌న్ ఎర‌బోలు
  • ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న
Panchatanytram set to release on December 9
బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ధన్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. 

నేడు ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసి, చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్ష వ్యూస్ దాటింది. సోషల్ మీడియాలోనూ పంచతంత్రం ట్రైలర్, పోస్టర్లు సందడి చేస్తున్నాయి.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి... సంతోషాలే కాదు... బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం... మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ఎలా ముందుకెళ్లామ‌నేది 'పంచతంత్రం' క‌థాంశం అని క్లియ‌ర్‌గా తెలుస్తుంది. 

సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌బోయే ఐదు జంట‌ల‌కు ఒక్కో క‌థ .. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతుంది. 

ప్ర‌తి క‌థ‌లో మ‌న చుట్టూ ఉన్న స‌మాజాన్ని అందులో వ్య‌క్తుల వ్య‌క్తిత్వాల‌ను ద‌ర్శ‌కుడు హ‌ర్ష ఎంతో అర్థ‌వంతంగా ముందుకు తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ యాంథాల‌జీని ద‌ర్శ‌కుడు ఎలా ట్రీట్ చేశార‌నే ఎగ్జ‌యిట్‌మెంట్ కూడా క‌లుగుతుంది. అర్థ‌వంత‌మైన సంభాష‌ణ‌లు ప్ర‌తి పాత్ర‌లోని భావోద్వేగాల‌ను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. స‌న్నివేశాల‌ను, వాటిలోని ఎమోష‌న్స్‌ను ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతం, రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి.