పదవులను మార్చినంత మాత్రాన ఆ నాయకులను తక్కువ చేసినట్టు కాదు: వైవీ సుబ్బారెడ్డి

26-11-2022 Sat 16:37 | Andhra
  • పార్టీ పదవుల్లో భారీ మార్పులు చేసిన జగన్
  • వారి సేవలను మరోచోట వినియోగించుకుంటామన్న సుబ్బారెడ్డి
  • 95 శాతం హామీలను నెరవేర్చిన ఘనత జగన్ దని కితాబు
YV Subba Reddy comments on changes of party leaderships
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల పదవుల్లో భారీగా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. పలువురిని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మార్చేశారు. ఈ నాయకత్వ మార్పుపై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మట్లాడుతూ... పదవులను మార్చినంత మాత్రాన ఆ నాయకులను తక్కువ చేసినట్టు కాదని అన్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలను మరో చోట వినియోగించుకోవాలనేది పార్టీ ఆలోచన అని చెప్పారు. పాదయాత్రలు ఎవరు చేసినా నష్టమేమీ లేదని... ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత జగన్ దని అన్నారు. ఏపీలో ప్రజల సంక్షేమ పథకాలు రాజ్యాంగ స్ఫూర్తితో అమలవుతున్నాయని చెప్పారు. టీడీపీ పాలనలో చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు.