మరోసారి కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల

26-11-2022 Sat 15:42 | Telangana
  • ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారన్న షర్మిల
  • దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపాటు
  • ప్రతిపక్షం బలంగా ఉంటే కేసీఆర్ ఆటలు సాగేవి కాదని వ్యాఖ్య
KCR cheating people with fake promices says Sharmila
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు ప్రజలతో పని లేదని ఆమె అన్నారు. ఎన్నికలు ఉంటేనే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారని.... ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్నీ ఒకటేనని చెప్పారు. టీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ లు అమ్ముడుపోయాయని ఆరోపించారు. 

కేసీఆర్ కు పరిపాలన చేతకాదని... అయితే దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షం బలంగా ఉంటే కేసీఆర్ ఆటలు సాగేవి కాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్ల అవినీతి జరిగినా విపక్షాలు ప్రశ్నించలేదని విమర్శించారు. కేసీఆర్ అవినీతి పాలనను ప్రశ్నించేందుకే తాను పాదయాత్రను చేపట్టానని చెప్పారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన వస్తుందని అన్నారు.