తెలంగాణ ప్రజల నాడి నాకు తెలుసు.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం: అమిత్ షా

26-11-2022 Sat 14:32 | Telangana
  • తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న అమిత్ షా
  • బీజేపీ సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే వంటిదని వ్యాఖ్య
  • మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని ధీమా
BJP going to win in Telangana says Amit Shah
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. భారీ మెజార్టీతో తెలంగాణలో విజయాన్ని కైవసం చేసుకోబోతున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల నాడి తనకు తెలుసని... రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని అన్నారు. 

ఎన్నికలకు ముందు తాను తెలంగాణకు వెళ్తానని... బీజేపీని గెలిపించుకుంటామని చెప్పారు. బీజేపీ సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే వంటిదని అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది కూడా ఎన్డీయే ప్రభుత్వమేనని.. మోదీ మరోసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నారని అన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్ 2022లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.