పాక్ నుంచి మన భూభాగంలోకి డ్రోన్.. కూల్చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు

26-11-2022 Sat 14:29 | International
  • పంజాబ్ లో అంతర్జాతీయ సరిహద్దు ద్వారా 
    మన దేశంలోకి వచ్చిన డ్రోన్
  • పసిగట్టి కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ సిబ్బంది
  • బుల్లెట్ తగిలి అమృత్ సర్ లో వ్యవసాయ క్షేత్రంలో కూలిన డ్రోన్
BSF shoots down Pak drone along international border in Punjab Amritsar
సరిహద్దులో మన దేశ సైనికులను పాకిస్థాన్ కవ్వించే ప్రయత్నం చేస్తోంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. శుక్రవారం రాత్రి పంజాబ్, అమృత్ సర్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ డ్రోన్ ను భారత సైనికులు గుర్తించారు. పాకిస్థాన్ నుంచి మన భూభాగంలోకి వస్తున్నట్టు పసిగట్టారు. 

దానిపై సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సైనికులు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ తగలడంతో డ్రోన్ అమృత్‌సర్ జిల్లాలోని డావోకే గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పడిపోయింది. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో డ్రోన్ ను స్వాదీనం చేసుకున్నారు. దీన్ని చైనాలో తయారైన క్వాడ్ కాప్టర్ డిజె1 మాట్రిస్ 300 ఆర్టీకే రకం డ్రోన్ గా గుర్తించారు.