ఇస్రో ఖాతాలో మరో విజయం.. ఒకేసారి తొమ్మిది ఉపగ్రహాల ప్రయోగం
- పీఎస్ఎల్వీ సీ54 మిషన్ ప్రయోగం సక్సెస్
- 8 సూక్ష్మ ఉపగ్రహాలు కాగా, ఒకటి ఇస్రో అభివృద్ధి చేసింది
- శ్రీహరి కోట నుంచి జరిగిన ప్రయోగం
ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన తొమ్మిదింటిలో ఎనిమిది నానో శాటిలైట్లు కావడం గమనార్హం. వీటిని ప్రైవేటు కంపెనీలు తయారు చేశాయి. అలాగే, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ -06ను ఇస్రో అభివృద్ధి చేసింది. సముద్ర వాతావరణ పరిస్థితులను ఇది అధ్యయనం చేస్తుంది. భూటాన్ కు సంబంధించి నానో శాటిలైట్-2 కూడా ప్రయోగించిన వాటిల్లో ఒకటి.