ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా: కృతి సనన్

  • ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నారంటూ బీటౌన్ లో ప్రచారం
  • 'ఆదిపురుష్'లో నటించిన ప్రభాస్, కృతి
  • ఇద్దరిదీ అందమైన జంట అని కితాబునిచ్చిన వరుణ్ ధావణ్
I will marry Prabhas says Kriti Sanon

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు బాలీవుడ్ భామ కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 'ఆదిపురుష్' చిత్రంలో ఇద్దరూ జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని అంటున్నారు. తాజాగా ఈ అంశంపై కృతి స్పందించింది. 

ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంకోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ... ప్రభాస్ జీవితంలో కొత్త డార్లింగ్ ఉందని అన్నారు. ప్రభాస్, కృతి ఇద్దరిదీ అందమైన జంట అని కితాబునిచ్చాడు. 

మరోవైపు, అనుష్క శెట్టి, ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంపాటు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తమ మధ్య అలాంటిదేమీ లేదని ప్రభాస్, అనుష్క ఇద్దరూ స్పష్టం చేశారు. దీంతో, ఆ ప్రచారం ఆగిపోయింది. ఇప్పడు ప్రభాస్, కృతిల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

More Telugu News