Maharashtra: ఓటు హక్కు ఉంటేనే మహారాష్ట్రలో కాలేజీ సీటు

  • మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో అమలులోకి
  • ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వ అధికారులు
  • యువతను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యమన్న మరాఠా సర్కారు
  • నాలుగేళ్ల డిగ్రీ కోర్సును వచ్చే ఏడాది నుంచే ప్రవేశపెడతామని వెల్లడి
voter rigistration is mondetory for colege seat in Maharastra

ఓటరుగా నమోదుపై యువతలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో ప్రవేశాలను ఓటు హక్కుతో ముడిపెట్టాలని నిర్ణయించింది. అడ్మిషన్ కావాలంటే ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలని రూల్ తీసుకురానున్నట్లు తెలిపింది. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కొత్త రూల్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

మరోవైపు, వచ్చే ఏడాది జూన్ నుంచి జాతీయ విద్యావిధానం ద్వారా రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నత విద్యావ్యవస్థలో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, కేవలం 32 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు కోసం ముందుకొచ్చారు. దీంతో యూనివర్సిటీలు, కాలేజీలలో అడ్మిషన్ కావాలంటే ఓటు హక్కు ఉండాల్సిందేనని రూల్ తెచ్చారు. 

యూనివర్సిటీలలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఎన్ఈపీ అమలులో వచ్చే ఇబ్బందులు, అనుమానాల పరిష్కారం కోసం విశ్రాంత వీసీలతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

More Telugu News