యూకే ప్రధాని రిషీ సునాక్ కూతురు కూచిపూడి డ్యాన్స్.. వీడియో ఇదిగో!

26-11-2022 Sat 10:05 | Offbeat
  • అంతర్జాతీయ కూచిపూడి వేడుకల్లో ప్రదర్శన
  • లండన్ లో ‘రంగ్’ పేరుతో జరుగుతున్న వేడుకలు
  • దాదాపు వంద మంది కళాకారుల ప్రదర్శన
Rishi Sunak  Daughter Performs Kuchipudi At UK Event
యూకే ప్రధాన మంత్రి రిషీ సునాక్ కూతురు అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై కూచిపూడి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ కూచిపూడి డ్యాన్స్ వేడుకల్లో అనౌష్క పాల్గొన్నారు. తొమ్మిది సంవత్సరాల వయసున్న అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటున్నట్లు సమాచారం. తాజాగా లండన్ లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 100 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 

నాలుగేళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ యువతి వీల్ చెయిర్ లోనే డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. యూకే ప్రధాని పదవిని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కృష్ణ సునాక్, అనౌష్క సునాక్.