TTD: భక్తుల తలనీలాల ద్వారా వెంకన్నకు భారీ ఆదాయం

  • తిరుమలలో స్వామివారికి తలనీలాల సమర్పణ
  • మొక్కులు తీర్చుకునే భక్తులు
  • తాజాగా 21 వేల కిలోల తలనీలాల వేలం
  • స్వామివారికి రూ.47.92 కోట్ల రాబడి
TTD gets huge profit from hair

కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తుల తలనీలాల రూపంలో భారీ ఆదాయం లభించింది. దేశం నలుమూలల నుంచి తిరుమల వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. ఈ తలనీలాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి ఏటా ఆన్ లైన్ లో వేలం వేస్తుంది. ఈ తలనీలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. 

ఈసారి టీటీడీ 21,100 కిలోల తలనీలాలను వేలంలో ఉంచగా, కళ్లు చెదిరే స్థాయిలో మొత్తం రూ.47.92 కోట్ల ధర పలికింది. వేలం వేసిన తలనీలాల్లో వివిధ సైజులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఈ తలనీలాలను గ్రేడింగ్ చేస్తారు.

ఫస్ట్ గ్రేడ్- 27 అంగుళాల తలనీలాలు
సెకండ్ గ్రేడ్- 19 నుంచి 26 అంగుళాలు
థర్డ్ గ్రేడ్- 10 నుంచి 18 అంగుళాలు
ఫోర్త్ గ్రేడ్- 5 నుంచి 9 అంగుళాలు
ఫిఫ్త్ గ్రేడ్- 5 అంగుళాల కంటే తక్కువ

వీటిని టీటీడీ వేలం సమయం వరకు ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విగ్గుల తయారీ కేంద్రాల్లో ఈ తలనీలాలను ఉపయోగిస్తారు.

More Telugu News