ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కమలహాసన్

25-11-2022 Fri 17:33
  • జ్వరం, దగ్గుతో బాధపడిన కమలహాసన్
  • చెన్నై శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స
  • అనారోగ్యం నుంచి కోలుకున్న వైనం
  • కొన్ని రోజుల విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
Kamal Haasan discharged from hospital
ప్రముఖ నటుడు కమలహాసన్ ఇటీవల జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో వైద్యులు కమల్ ను నేడు డిశ్చార్జి చేశారు. 

గత బుధవారం హైదరాబాద్ కు వచ్చిన కమలహాసన్... దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిశారు. అదే రోజు చెన్నై వెళ్లిపోయిన ఆయన సాయంత్రానికి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. 

కమల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందగా, వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై బులెటిన్ల ద్వారా సమాచారం అందించారు. ఈ మధ్యాహ్నం కమల్ ను డిశ్చార్జి చేసిన వైద్యులు, కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కమల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-6 తమిళ్ రియాలిటీ షోకు హోస్ట్ చేస్తూ, ఇండియన్-2 చిత్రంలో నటిస్తున్నారు.